![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1096 లో.. నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయని దేవయానికి శైలేంద్ర చెప్తూ మురిసిపోతుంటాడు. అప్పుడే ఏం అనుకున్నవి అయ్యాయంటూ ఫణీంద్ర వస్తాడు. నువ్వు ఏం పని చేసావో నాకు అంతా తెలిసింది. నా కడుపున చెడ పుట్టావ్ కదరా అని ఫణీంద్ర తిడతాడు. ఏం చేసాడని దేవయాని అడుగుతుంది. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది. మీరు ఎప్పుడు మారుతారో నాకు అర్థం కావడం లేదని ఇద్దరిపై ఫణీంద్ర విరుచుకుపడతాడు.
అసలేం జరిగిందని శైలేంద్రని దేవయాని అడుగుతుంది. ఇక రిషి కన్పించాడని శైలేంద్ర ఫోన్ చేసిన విషయం చెప్తాడు. వాళ్ళని టెన్షన్ పెట్టాను.. నాకు చాలా హ్యాపీగా ఉందని శైలేంద్ర అంటాడు. ఇక నుండి నువ్వు, నేను టైమ్ దొరికినప్పుడల్ల వాళ్ళతో ఆడుకోవాలని దేవయానికి శైలేంద్ర చెప్తాడు. మరొకవైపు రిషి ఫోటోని పట్టుకొని వసుధార ఎమోషనల్ అవుతుంది.
మరుసటిరోజు శైలేంద్ర కాలేజీకి వెళ్తాడు. వసుధార రిషిని తీసుకొని వస్తానంటూ అంత కాన్ఫిడెన్స్ గా చెప్తుంది. అసలు రిషి లేడు కదా అని శైలేంద్ర అనుకుంటాడు. అప్పుడే కాలేజీ ఇన్ స్పెక్షన్ కోసం ఇద్దరు ఆఫీసర్స్ వస్తారు. ఇక దొరికిందే ఛాన్స్ అని శైలేంద్ర అనుకుంటాడు. వాళ్లతో మాట్లాడతాడు. ఎవరని వాళ్ల అడుగుతారు. నా తమ్ముడు ఈ కాలేజీ లో చదువుతున్నాడు.. కాలేజీ లో స్టూడెంట్స్ గురించి అసలు పట్టించుకోవడం లేదట.. ఏ సౌకర్యం అందుబాటులో లేవట.. ఈ విషయం మా తమ్ముడు చెప్తే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానని వాళ్లకు శైలేంద్ర చెప్తాడు.. ఈ కాలేజీ కి మంచి పేరు ఉంది కదా.. ఎందుకిలా చెప్తున్నారని వాళ్ళు అంటారు. నేను చెప్పేది అబద్ధమైతే అదిగో నా తమ్ముడు వెళ్తున్నాడు.. అడగండి అని శైలేంద్ర ఒక స్టూడెంట్ ని పిలిచి సైగ చేస్తాడు. దాంతో ఆ స్టూడెంట్ శైలేంద్ర లాగే చెప్తాడు. అది నిజమేనని నమ్మిన ఇన్ స్పెక్షన్ ఆఫీసర్స్ వెళ్ళిపోతారు.
ఆ తర్వాత వసుధార వర్క్ చేస్తుంటే తనకి ఓ మెయిల్ వస్తుంది. అది చూసి షాక్ అవుతుంది. కాలేజీ కి ఎగ్జామ్స్ సెంటర్ ఎలాట్ చెయ్యడం లేదని ఉంటుంది. అప్పుడే మహేంద్ర మను ఇద్దరు వస్తారు. అది విని వాళ్ళు షాక్ అవుతారు. మహేంద్ర వెంటనే మినిస్టర్ కి కాల్ చేసి చెప్తాడు. నేను కాలేజీకి వస్తున్నానని మినిస్టర్ చెప్తాడు. మినిస్టర్ వచ్చక రిషి గురించి పేపర్ లో ఎందుకు ఇచ్చావని వసుధారని మినిస్టర్ అడుగుతాడు. రిషి చనిపోయాడు కదా అని మినిస్టర్ అనగానే.. లేదని వసుధార వాదిస్తుంది. ఎందుకిలా చేస్తున్నవంటూ ఈ విషయం అందరికి తెలుసు కదా అని మినిస్టర్ అంటాడు. ఏమో సర్ ఆలా ప్రవర్తిస్తుందంటూ శైలేంద్ర అంటాడు. రిషి ఉన్నాడని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |